మోత్కూరు/గుండాల, జూన్ 7 : పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మోత్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో మొక్క నాటారు. మండలంలోని దాచారంలో జిల్లా అధికారులతో కలిసి పర్యటించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్‌లో కంపోస్టు తయారీ, నర్సరీని పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేసుకొని ప్రజా ప్రతినిధులు బాధ్యతగా పని చేయడంతో గ్రామాల్లో పనులు బాగా జరిగాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతీ అధికారి సునంద, డీఎల్పీఓ యాదయ్య, మండల ప్రత్యేకాధికారి యాదయ్య, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, ఎంపీఓ రావూఫ్ అలీ, గ్రామ ప్రత్యేకాధికారి కందుకూరి మంగమ్మ, ఏపీఓ కరుణకార్, పంచాయతీ కార్యదర్శి శృతి, గ్రామస్తులు పాల్గొన్నారు. గుండాల మండలంలోని అనంతారం, సుద్దాల, పాచిల్ల గ్రామాల్లో వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను రవీందర్రావు పరిశీలించారు. డంపింగ్ యార్డుల్లో వర్మీ కంపోస్ట్ ఎందుకు తయారు చేయడం లేదని ఎంపీఓ జనార్దన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శులను సమన్వయం చేసుకుంటూ పనులు చేపట్టాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి వెంకటరమణ, ఎంపీడీఓ శ్రీనివాసులు, పీఆర్ఏఈ దామోదర్, ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకూబ్‌పాషా బేగం, సర్పంచులు తుమ్మ డెన్నీస్రెడ్డి, గూడ ఉపేంద్రారవీందర్గౌడ్, పందుల రేఖాయాదగిరి, ఉప సర్పంచులు అత్తి భాస్కర్, సోమ నర్సయ్య, పంచాయతీ కార్యదర్శులు మధు, మౌనిక పాల్గొన్నారు.
రాఘవాపురంలో పనుల తనిఖీ..
ఆలేరు రూరల్ : మండలంలోని రాఘవాపురంలో పల్లె ప్రగతి పనులను అదనపు కలెక్టర్ దీపక్‌తివారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్యం, శానిటేషన్ పనులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీఓ సలీం, సీడీపీఓ చంద్రకళ, సర్పంచ్ రాంప్రసాద్, అంగన్వాడీ టీచర్ అనూష పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో సమస్యలు పరిష్కారం
బొమ్మలరామారం : పల్లె ప్రగతితో గ్రామాల్లోని సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి అన్నారు. 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని సోమాజిపల్లిలో ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామ వీధుల్లో చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో సర్పంచులు మెడబోయిన గణేశ్, బీరప్ప, వడ్లకొండ అరుణ, నవీన్‌గౌడ్, హారిక, వార్డు సభ్యులు, ఆశ కార్యకర్తలు, వైద్య, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధికే పల్లె ప్రగతి
యాదగిరిగుట్ట రూరల్ : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టిందని మండల ప్రత్యేకాధికారి కృష్ణవేణి అన్నారు. పల్లె ప్రగతి 5వ విడుత కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని వంగపల్లిలో జరిగిన పనులను ఆమె పరిశీలించారు. గ్రామస్తులకు పల్లె ప్రగతి ఉద్దేశాన్ని వివరించారు. ప్రజలంతా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, వైకుంఠధామం, నర్సరీని పరిశీలించారు. గ్రామంలో పచ్చదనం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కారం ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ కానుగు కవిత, ఎంపీటీసీ రేపాక మౌనిక, ఉప సర్పంచ్ మౌనిక, ఎంపీఓ చంద్రశేఖర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
రాజాపేట మండలం పారుపల్లిలో..
రాజాపేట : పల్లె ప్రగతితోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీటీసీ రాపోలు కవితాతిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని పారుపల్లిలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, వైకుంఠధామాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.
పరిశుభ్రంగా గ్రామాలు
ఆత్మకూరు(ఎం) : పల్లె ప్రగతితో గ్రామాలు శుభ్రంగా మారడంతోపాటు పచ్చదనం సంతరించుకుంటున్నాయని ఎంపీడీఓ ఆవుల రాములు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని తుక్కాపురంలోని పల్లె ప్రకృతి వనం, నర్సరీని పరిశీలించారు. అదేవిధంగా మండల వాప్తంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచులు జెన్నాయికోడె నగేశ్, గణగాని మాధవి, దయ్యాల రాజు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్, హసీనా, ప్రత్యేకాధికారులు పాండు, భాస్కర్ పాల్గొన్నారు.
ఆలేరులో పట్టణ ప్రగతి పనులు
ఆలేరు : మున్సిపాలిటీ పరిధిలోని 2, 6వ వార్డుల్లో మంగళవారం చేపట్టిన పట్టణ ప్రగతిలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పాల్గొన్నారు. 2వ వార్డు వైకుంఠధామంలో చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగుకాల్వలను శుభ్రం చేయించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆలేరు పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం, కౌన్సిలర్ బేతి రాములు, రాయపురం నర్సింహులు పాల్గొన్నారు.
మోటకొండూరులో..
మోటకొండూర్ : పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మోటకొండూర్ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండల కేంద్రంలో మొక్కలు నాటారు. పంచాయతీ సిబ్బందితో పరిసరాలు శుభ్రం చేయించారు.