చిట్యాల, జూన్ 7 : మున్సిపాలిటీని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని అందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు సహకరించాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2, 3, 9, 10, 12 వార్డుల్లో సుమారు రూ. 50 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపాలిటీ, మండలానికి చెందిన 30మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి పట్టణ ప్రగతి, పల్లెల అభివృద్ధికి పల్లెప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నదని తెలిపారు. అంతకు ముందు పట్టణంలో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్‌రెడ్డి, కమిషనర్ రాందుర్గారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆది మల్లయ్య, ఏఈ శంకర్‌బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగస్వామి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, సిలువేరు మౌనికాశేఖర్, రెముడాల లింగస్వామి, పందిరి గీతారమేశ్, జిట్టా పద్మా బొందయ్య, నాయకులు కర్నాటి ఉప్పల్‌రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెండె సైదులు, కల్లూరి మల్లారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పొన్నం లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి జిట్టా చంద్రకాంత్, వనమా వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు.
జిల్లా స్థాయి టెన్నీస్ బాల్, క్రికెట్ పోటీలు ప్రారంభం
నార్కట్‌పల్లి: మండలకేంద్రంలో బొక్క సంతోష్ రెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి టెన్నీస్ బాల్, క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్కట్‌పల్లిలో వాకింగ్ ట్రాక్, ఆడుకు నేందుకు ఆట స్థలాలను త్వరలో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కాసేపు క్రికెట్ ఆట ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి,నిర్వాహకులు బొక్క భూపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, చిరుమర్తి యాదయ్య, దుబ్బాక శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు దోసపాటి విష్ణుమూర్తి, చెర్వుగుట్టు ఆలయ ధర్మకర్తలు పసునూరి శ్రీను, బొబ్బల దేవేందర్, కోఆప్షన్ సభ్యుడు వాజిద్ అలీ, వార్డు సభ్యులు మేడబోయిన శ్రీను, మహేశ్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎల్ఓసీ ఆందజేత
నార్కట్‌పల్లికి చెందిన జాల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతుడడంతో ఆయనకు మంజూరైన రూ.3 లక్షల ఎల్ఓసీ లబ్ధిదారుడి భార్యకు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి అందజేశారు.