చెప్పినట్టే రాష్ట్రం సాధించిన కేసీఆర్ నేడు ఊరూవాడ అభివృద్ధి.. ఇంటింటా సంక్షేమం సీఎం హోదాలో ఫ్లోరైడ్ పీడకు శాశ్వత విరుగుడ సాగులో నంబర్ వన్‌గా ఉమ్మడి జిల్లా సంతోషం వ్యక్తం చేస్తున్న ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు కలెక్టరేట్లో జెండావిష్కరించనున్న మండలి చైర్మన్ గుత్తా ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి శుభాకాంక్షలు
నల్లగొండ, జూన్ 1 : రైతులను లాభదాయక పంటల వైపు మళ్లించి లక్షాధికారులుగా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘వానకాలం సీజన్లో పంటల సాగు యాజమాన్య పద్ధతుల’పై నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన రైతులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో నల్లగొండ జిల్లాకేంద్రంలోని లక్ష్మి గార్డెన్లో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2014కు ముందు, ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయం ఎలా ఉందో గమనించాలన్నారు. 24గంటల ఉచిత విద్యుత్‌తో పాటు పెట్టుబడి సాయం, రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే రైతు బీమా ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. రైతును, వ్యవసాయాన్ని లాభం దిశగా నడిపించడానికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ చిత్తశుద్ధి వల్లే రాష్ట్రంలో 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నుంచి 47లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెరిగిందన్నారు. ఉత్పత్తిదారుడే ధర నిర్ణంచే పరిస్థితి లేదని అందుకోసమే రైతు వేదికలు, రైతుబంధు సమితిలు ఏర్పాటు చేసి ఏఏ పంటలు వేయాలి.. వేటితో అధిక లాభం ఉంటుందని.. రైతుకు వివరించి మార్కెట్ సౌకర్యాన్ని బట్టి పంటల సాగు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 80శాతం వరకు ఎర్ర నేలలే ఉన్నాయని, పంటలు పండించేందుకు ఇంతకంటే సారవంతమైన భూములు ఎక్కడ లేవని పేర్కొన్నారు. రైతులు మూస పద్ధతి వీడి ప్రత్యామ్నాయం వైపు చూడాలన్నారు. 2014కు ముందు కరెంట్ కోసం ఎన్ని ఘర్షణలు జరిగాయో తెలవదా అన్నారు. 2018 తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ఇస్తుంటే ప్రజలే విరామం ప్రకటించండి అని విన్నపాలు చేశారన్నారు. సాగునీటితో పాటు తాగు నీటి విషయంలో ఎంతో శ్రమ పడటం వల్లే జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదన్నారు. కోతులు పంట పొలాలు నాశనం చేస్తుంటే.. కొన్ని రాజకీయ కోతులు మొత్తంగా వ్యవసాయ రంగాన్నే నాశనం చేస్తున్నాయని రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దీనికి స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఆ రాజకీయ కోతుల మూక మొత్తం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే ఉద్భవించిందంటూ కాంగ్రెస్ నేతలపై పరోక్ష విమర్శలు చేశారు.
అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, నల్లగొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, భాస్కర్‌రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాంచంద్రనాయక్, వ్యవసాయ శాఖ అదనపు కమిషనర్ హనుమంతు, నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, పమేలా సత్పతి, నల్లగొండ జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జేడీఏ సుచరిత, ఏడీఏ హుస్సేన్ పాల్గొన్నారు.
రైతులు మార్కెట్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. 2021 సంవత్సరం వానకాలం సీజన్లో పంజాబ్ రాష్ట్రం 2కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేస్తే తెలంగాణలో 3కోట్ల దాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు. ఇది దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తిగా రికార్డు నమోదైందన్నారు. దేశంలో నూనె గింజల కొరత ఉన్నందున రైతులు ఉద్యాన పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. వానకాలంలో ఆయిల్ పామ్ విస్తరణకు ప్రభుత్వం 2లక్షల మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. రానున్న మూడేండ్లలో 10లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు పెంపునకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్లే రాష్ట్రం వ్యవసాయ రంగంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. దేశంలో రైతుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నదన్నారు. ప్రధానంగా రైతుబంధు, రైతు బీమా పథకాల అమలుతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. వ్యవసాయం అంటే తెలియని నాయకులు రైతుల పేరుతో రాష్ట్రంలో పాదయాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో తగిన గుణపాఠం చెప్తారన్నారు.
సీఎం కేసీఆర్ కృషి వల్లే వ్యవసాయానికి గౌరవం పెరిగిందని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సమైక్య పాలనలో వ్యవసాయాన్ని జీవచ్ఛవంలా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించడంతో పాటు, రైతుబంధు సమితిని ఏర్పాటు చేసి రైతుల సమస్యలు పరిష్కరిస్తుందన్నారు.