బొడ్రాయిబజార్, జూన్ 1 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని 17వ వార్డులోని చింతలచెరువులో కౌన్సిలర్ చింతలపాటి భరత్ మహజన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తాంజనేయ జీవ ధ్వజ ప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ సందర్భం గా మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. వార్డు అభివృద్ధికి సహా య సహకారాలు ఉంటాయని తెలిపారు. అనంతరం 4 వేల మందికి అన్నదానం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్లు సుంకరి రమేశ్, ఎలిమినేటి అభినయ్, మాజీ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్, బాల్తు కుమారస్వామి, బోనగిరి నర్స య్య, గరిగంటి లింగయ్య, వేల్పుల సురేశ్, కుంచం రఘు, రాజు, బాల్తు శ్రీనివాస్, ఐతగోని సైదులు పాల్గొన్నారు.