ఆత్మకూరు(ఎం), మే 31 : జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని పార్టీ మండలాధ్యక్షుడు బీసు చందర్‌గౌడ్ సూచించారు. మంగళవారం మండలంలోని పోతిరెడ్డిపల్లి, ఉప్పలపహాడ్, సి.రేపాకలో జరిగిన టీఆర్ఎస్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. సమావేశాల్లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు లగ్గాని రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల జనరల్ సెక్రటరీ పంజాల వెంకటేశ్‌గౌడ్, మామిడి శ్రీనివాస్‌రెడ్డి, సోషల్ మీడియా మండలాధ్యక్షుడు విజయ్, టీఆర్ఎస్ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి పరశురాములు, నాయకులు మల్లేశం, నర్సయ్య, బాలరాజు పాల్గొన్నారు.
కొలనుపాక, రాఘవాపురంలో సమావేశాలు..
ఆలేరు రూరల్ : ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని కొలనుపాక, రాఘవాపురంలో టీఆర్ఎస్ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సర్పంచులు ఆరుట్ల లక్ష్మీప్రసాద్‌రెడ్డి, బక్క రాంప్రసాద్, మదర్ డెయిరీ డైరెక్టర్ దొంతిరి సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మామిడాల నర్సింహులు, పీఏసీఎస్ డైరెక్టర్ ఆరె మల్లేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జంగ స్వామి, కరికె మల్లేశ్, టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు మామిడాల భానుచందర్, నాయకులు నీల మురళి, బాశెట్టి రాజు, బైరి కాలేందర్, రాచబోయిన కొండల్, గుర్రాల బాలరాజు, జంగ పరశురాములు, పరిదె సంతోష్ పాల్గొన్నారు.
దూదివెంకటాపురంలో..
రాజాపేట : రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సూచించారు. మంగళవారం మండలంలోని దూదివెంకటాపురంలో టీఆర్ఎస్ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ చామకూర గోపాల్‌గౌడ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నక్కిర్త కనకరాజు, నేరోళ్ల మల్లేశ్‌గౌడ్ పాల్గొన్నారు.