గరిడేపల్లి, మే 31 : ఒకే రకమైన పంటలను సాగు చేయడం వల్ల పొలాల్లో భూసారం తగ్గుతుంది. రోగాలను కలిగించే పురుగుల సంఖ్య బాగా పెరిగి దిగుబడి తగ్గుతుంది. పంటల మార్పిడి వల్ల భూమిలోని పోషకాలు సంవృద్ధిగా అందుతాయి. పంటల మార్పిడితో కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
రైతులు ఒకే రకమైన పంటలు సాగు చేయడం వల్ల ఆ పంట మొక్కలకు అవసరమైన పోషకాలు తక్కువవుతాయి. రోగకారక పురుగుల ఉధృతి పెరిగి దిగుబడి తగ్గుతుంది. వరుసగా ఒకే పంటను కాకుండా వివిధ రకాల పంటల సాగుతో పురుగుల జీవిత చక్రాన్ని నిలిపివేయవచ్చు. దాంతో రైతులు మంచి లాభాలను పొందగలుగుతారు.
– దొంగరి నరేశ్, కేవీకే శాస్త్రవేత్త, గడ్డిపల్లి