నార్కట్‌పల్లి, మే 20: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే పట్టణాలకు దీటుగా గ్రామాలు ఎంతో అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.మండలంలోని కొండపాకగూడెం గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శుక్రవారం వారు శంకుస్థాపన చేశారు. అలాగే చౌడంపల్లి ఎస్డీఎఫ్ నిధులు రూ. 20 లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన, వైకుంఠధామాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లె ప్రగతిలో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన దార యాదగిరికి సీఎం సహాయ నిధి నుంచి రూ. 4.50 లక్షలు మంజూరయ్యాయి. సంబంధిత చెక్కును క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య శుక్రవారం లబ్ధిదారుడికి అందజేశారు. ఆయన వెంట ఎంపీటీసీ మేకల రాజిరెడ్డి టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఉన్నారు.