కట్టంగూర్, మే 1 : బీఆర్ఎస్ సోషల్ మీడియా కట్టంగూర్ మండలాధ్యక్షుడు, మాల మహానాడు సోషల్ మీడియా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గోగు బాల సైదులు (32) అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్తో పాటు మాల మహానాడు, వివిధ పార్టీల నాయకులు సైదులు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. సైదులుకు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నాడు. కుటుంబాన్ని పరామర్శించిన వారిలో ఊటూరి ఏడుకొండలు, చల్లా కృష్ణారెడ్డి, ఎల్లపురెడ్డి సైదిరెడ్డి, మేకల రమేశ్, చెరుకు వెంకటాద్రి, మిధున్, అండు సోములు, మేడి ఇద్దయ్య, రెడ్డిపల్లి మనోహర్, మునుగోటి ఉత్తరయ్య, మేడి విజయ్, బొల్లెద్దు నర్సింహ్మ, అంతటి శ్రీను, ఐతగోని సైదులు ఉన్నారు.