e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home నల్గొండ కరోనా కట్టడికి మేము సైతం

కరోనా కట్టడికి మేము సైతం

కరోనా కట్టడికి మేము సైతం

దేవరకొండ రూరల్‌, మే 16 : కరోనా కట్టడికి మండలంలోని కొమ్మేపల్లి, పాత్లావత్‌ తండా గ్రామాల్లో ఆదివారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ను పిచికారీ చేశారు. మురుగు కాల్వలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ కరోనా సెకండ్‌వేవ్‌ గ్రామాల్లో చాలా వేగంగా వ్యాపిస్తున్నదని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఆయన వెంట ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు ఉన్నారు.

సొంతఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు
తిరుమలగిరి సాగర్‌ : కరోనా కట్టడికి మండల కేంద్రానికి చెందిన పలువురు యువకులు నడుం బిగించారు. ఆదివారం మండల కేంద్రంలో కరోనా మెగా హెల్త్‌క్యాంపు నిర్వహించారు. తమ సొంత ఖర్చుతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. యువకులు, సర్పంచ్‌ శాగం శ్రవణ్‌కుమార్‌రెడ్డి కలిసి ఏర్పాటు చేసిన శిబిరంలో 87 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. వారికి మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ వల్లవాయి అంజయ్య, కార్యదర్శి లక్ష్మారెడ్డి, సిబ్బంది, గ్రామ యువత పాల్గొన్నారు.

మాస్కుల పంపిణీ
దామరచర్ల : కర్నాటక రాష్ట్రంలోని బళ్లారి ఎస్పీగా పనిచేస్తున్న మండలంలోని గేర్‌తండాకు చెందిన అడావత్‌ సైదులు గ్రామస్తులకు ఏడువేల ఎన్‌- 95 మాస్కులను అందజేశారు. వీటిని గ్రామ నాయకులు ఆదివారం గ్రామస్తులకు పంపిణీ చేశారు. కరోనా వ్యాధిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించినట్లు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాంబాబు, ఉపసర్పంచ్‌ భద్యానాయక్‌, జగదీశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బాధితులకు బాసటగా ..
మిర్యాలగూడ రూరల్‌ : కరోనా బారిన పడిన కుటుంబాలకు కొందరు బాసటగా నిలుస్తున్నారు. మండలంలోని తక్కెళ్ల పహాడ్‌ గ్రామంలో ఐదు కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. దీంతో గ్రామ మాజీ సర్పంచ్‌ గుండు నరేందర్‌ ఆదివారం వారికి మాస్కులు, ఆహార పదార్థాలు అందించారు. కొత్తగూడెం గ్రామంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి రజక విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం, నిత్యావసరాలు, రూ. వెయ్యి చొప్పున అందించారు. కార్యక్రమంలో నందికొండ అంజయ్య, ఎర్రబెల్లి నాగేశ్వర్‌, పాతబోయిన వెంకటయ్య పాల్గొన్నారు.

కొవిడ్‌ పేషెంట్లకు పండ్లు పంపిణీ
మిర్యాలగూడ టౌన్‌ : బంజారామహిళా ఎన్‌జీఓ సంస్థ నిర్వాహకురాలు డాక్టర్‌ ఆనంద్‌ పరిమళ ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ఏరియా దవాఖానలో కొవిడ్‌ పేషెంట్లకు ఆదివారం పండ్లు పంపిణీ చేశారు. ఆమె వెంట రుషికేశ్‌ రాజు, కీర్తి, అశోక్‌, వినోద్‌, సరస్వతి, వేణు తదితరులు ఉన్నారు.

కూరగాయల పంపిణీ
పెద్దవూర : కరోనా, లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మండల కేంద్రానికి చెందిన రావుల లక్ష్మణ్‌ ఆదివారం ఎస్సీ కాలనీలో 100 కుటుంబాలకు కూరగా యలు పంపిణీ చేశారు.

25 మందికి నిత్యావసర సరుకులు..
కేతేపల్లి : మండలంలోని భీమారం గ్రామంలో కరోనాతో బాధపడుతున్న 25 మందికి సర్పంచ్‌ బడుగుల శ్రీనివాస్‌యాదవ్‌ ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేసారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు చిముట వెంకన్నయాదవ్‌, జి.నాగరాజు, సతీశ్‌, విష్ణు, బాలకృష్ణ, లింగయ్య, ఫరీద్‌, ఎల్లయ్య, బన్నీ, అభిలాశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడికి మేము సైతం

ట్రెండింగ్‌

Advertisement