e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home నల్గొండ అందరి సహకారంతో కరోనా కట్టడి

అందరి సహకారంతో కరోనా కట్టడి

అందరి సహకారంతో కరోనా కట్టడి

నల్లగొండ రూరల్‌, జూన్‌ 8 : అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని ఎంపీడీఓ వై.శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మండలంలోని నర్సింగ్‌భట్ల గ్రామంలోమంగళవారం కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్లి జాగ్రత్తలు, సూచనలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు అధైర్యపడ కుండా హోంఐసొలేషన్‌లో ఉండాలన్నారు. అంతకు ముందు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, కార్యదర్శి రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

కొత్తపల్లిలో గుడ్లు, పండ్ల పంపిణీ
మండలంలోని కొత్తపల్లి గ్రామంలో దాత ఆమంచి రాజలింగం సహకారంతో సర్పంచ్‌ నాగయ్య కరోనా పేషెంట్లకు గుడ్లు ,పండ్లు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ పెరిక కాత్యాయని, మల్లేశం, సైదులు, లింగస్వామి, నరసింహ, నాగరాజు, ఎల్లేశ్‌, ఉపేందర్‌ పాల్గొన్నారు.

మహిళా పోలీస్‌ స్టేషన్‌లో..
లాక్‌డౌన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు నల్లగొండలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌లో హెరిటేజ్‌ ఏఎస్‌ఎం మామిడి మిథున్‌ కుమార్‌ ఆధ్వర్యంలోఎనర్జీ డ్రింక్స్‌, శానిటైజర్స్‌, మాస్కులు, బిస్కెట్స్‌ సీఐ రాజశేఖర్‌గౌడ్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగెల్లి సాయి, పగుడోజు సాయి హితేశ్‌, ఎస్‌ఐ నాగలక్ష్మి, ఏఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి, హెచ్‌సీ యాదగిరి, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిత్యావసర వస్తువుల పంపిణీ
పెద్దవూర : మండలంలోని ఊట్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి యాదగిరి (45) ఇటీవల కరోనాతో మృతి చెందగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులకు ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తొడిమె అరుణ, అంగన్‌వాడీ టీచర్‌ శారద, స్థానికులు రవీందర్‌రెడ్డి, వల్లపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

నేరళ్లపల్లిలో ..
నాంపల్లి : మండలంలోని నేరళ్లపల్లిలో కరోనా పేషెంట్లకు గ్రామ యువకులు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో శ్రీధర్‌, శ్రీకర్‌, నాగరాజు, సతీశ్‌, శ్రీను శ్రీశైలం ఉన్నారు.

స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో
దేవరకొండ : పట్టణంలోని ఆయ్యప్పనగర్‌కు చెందిన శంకరయ్య పక్షవాతంతో బాధపడుతుండగా అతడి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. దీంతో స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బియ్యం,నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌వీటీ, తాళ్ల శ్రీధర్‌గౌడ్‌, కృష్ణ కిశోర్‌, వైఎస్‌ కరుణాకర్‌, రాపోలు నిరంజన్‌, తాళ్ల సురేశ్‌, రమేశ్‌, ఏడుకొండల్‌, జగన్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వానికి సహకరించాలి
మునుగోడు : కొవిడ్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని ఇప్పర్తి సర్పంచ్‌ బొజ్జ సుజాత కోరా రు. ఇప్పర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ ంలో 87 మందికి కరోనా పరీక్షలు చేయగా 6 గురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, ఉప సర్పంచ్‌ పులకరం సైదులు, శ్రీ ను, ఏఎన్‌ఎం రాధ, ధనమ్మ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆర్థిక సాయం
వేములపల్లి : మొల్కపట్నం ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్‌ కేంద్రం నిర్వహణ కోసం గ్రామానికి చెందిన కందిమళ్ల చలపతిరెడ్డి రూ.10వేలను అందించారు. ఈ సం దర్భంగా సర్పంచ్‌ నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ దాతలు కొవిడ్‌ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు .కార్యక్రమంలో ఈట యాదగిరి, నవీన్‌, సైదిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందరి సహకారంతో కరోనా కట్టడి

ట్రెండింగ్‌

Advertisement