e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home నల్గొండ గల్లీ లీడర్‌ స్థాయిలో కూడాఅభివృద్ధి చేయని జానారెడ్డి

గల్లీ లీడర్‌ స్థాయిలో కూడాఅభివృద్ధి చేయని జానారెడ్డి

గల్లీ లీడర్‌ స్థాయిలో కూడాఅభివృద్ధి చేయని జానారెడ్డి

నందికొండ, ఏప్రిల్‌ 1 : జానారెడ్డి ఏండ్ల తరబడి మంత్రిగా పనిచేసినా నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో చిన్న లీడరు స్థాయి అభివృద్ధి కూడా చేయలేదని డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ విమర్శించారు. నందికొండ హిల్‌కాలనీలోని వాసవీ కళాశాలలో గురువారం ముస్లిం మైనార్టీల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 20 సంవత్సరాలుగా అనేక పదవులను అనుభవించిన జానారెడ్డి నియోజకవర్గంలోని సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రెండేండ్లలోనే అనేక అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. నందికొండను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి బాట పట్టించారన్నారు. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 12 గురుకుల పాఠశాలలు ఉండగా నేడు 204 గురుకుల పాఠశాలలు, 18 కళాశాలలను సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేశారని, లక్షల మంది విద్యార్థులు నేడు అందులో చదువుతూ లబ్ధిపొందుతున్నారన్నారు. షాదీముబారక్‌, కల్యాణ లక్ష్మి పథకాలు రాష్ట్రంలో 9 లక్షల మందికి ఉపయోగపడ్డాయని తెలిపారు. ముస్లింల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. రానున్నరోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని, నోముల భగత్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

మండలాల ఇన్‌చార్జీల నియామకం
ఈ సందర్భంగా ఎన్నికలప్రచారానికి మండలాల వారీగా మైనార్టీ నాయకులను మంత్రి నియమించారు. పెద్దవూర – షరీఫుద్దీన్‌, మోహిద్‌ఖాన్‌, తిరుమలగిరి (సాగర్‌)- బద్రుద్దీన్‌, ముజీబ్‌, గుర్రంపోడు – మున్వర్‌ఖాన్‌, బషీరుద్దీన్‌, అనుముల -ఇంతియాజ్‌, నిడమనూర్‌ -ఖాజాఅరీఫుద్దీన్‌, నిరంజన్‌వలీ, మాడ్గులపల్లి- అలీబాక్రీ, షబ్బీర్‌, త్రిపురారం- బాబా, శంషొద్దీన్‌, నందికొండ మున్సిపాలిటీ -అర్షద్‌అలీ, మసిఉల్లాఖాన్‌, హాలియా మున్సిపాలిటీ షరీఫుద్దీన్‌, బాసిత్‌. ఈ కార్యక్రమంలో నందికొండ ఎన్నికల ఇన్‌చార్జీలు కరీంనగర్‌ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, నందికొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంద రఘువీర్‌, కౌన్సిలర్లు మంగ్తా, నిమ్మల ఇందిరాగౌడ్‌, రమేశ్‌జీ, నాయకులు నోముల లక్ష్మి, మోహన్‌నాయక్‌, ఆదాసు విక్రమ్‌, మైనార్టీ నాయకులు అబ్బాస్‌, బషీర్‌, సుభాని, హఫీజ్‌ అబ్దుల్‌ వహీద్‌, ఇక్బాల్‌, జహీరుద్దీన్‌, అహ్మద్‌అలీ, జబ్బార్‌, బాసిత్‌, అన్వర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గల్లీ లీడర్‌ స్థాయిలో కూడాఅభివృద్ధి చేయని జానారెడ్డి

ట్రెండింగ్‌

Advertisement