కట్టంగూర్, ఏప్రిల్ 11: వేసవిలో ప్రయాణికులు, ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్ రావు తెలిపారు. మండల కేంద్రంలోని నల్లగొండ బస్ స్టాప్ వద్ద గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులు ప్రజలు, వ్యాపారస్తులకు చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎండాకాలం పూర్తి అయ్యేంతవరకు చలివేంద్రాన్ని కొనసాగించాలని గ్రామపంచాయతీ సిబ్బందికి సూచించారు.
వేసవి దృష్టిలో ఉంచుకొని దాతలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. చలివేంద్రాలను ప్రజలు ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, గ్రామపంచాయతీ సిబ్బంది చిత్తలూరు జానకి రాముడు, కాపుగంటి శీను, కానుగు వెంకన్న, యర్కల సత్తయ్య, బాలచందర్ తదితరులు పాల్గొన్నారు.