కేతేపల్లి, జనవరి 19 : పేదల కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం కంటి వెలుగు పథకాన్ని కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. అధికారులు ప్రత్యేక బాధ్యతలు తీసుకొని ప్రతి ఒక్కరికీ నేత్ర పరీక్షలు చేయాలన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు, శస్త్ర చికిత్సలు ప్రభుత్వమే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పి.శేఖర్, జడ్పీటీసీ బి.స్వర్ణలత, ఎంపీడీఓ రమేశ్ దీన్‌దయాళ్, సర్పంచ్ జటంగి ముత్తమ్మ, వైస్ ఎంపీపీ మాధవి, మండల ప్రత్యేకాధికారి రంజిత్ పాల్గొన్నారు.
కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి : జడ్పీ చైర్మన్ బండ
నార్కట్‌పల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండో విడుత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి సూచించారు. మండలంలోని అక్కెనపల్లి, ఎల్లారెడ్డిగూడెం గ్రామాల్లో గురువారం కంటి వెలుగు శిబిరాలను ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరి యాదగిరి, సర్పంచులు మేడి పుష్పలతాశంకర్, మల్లేశ్, చంద్రశేఖర్, ఎంపీటీసీలు మేకల రాజిరెడ్డి, కనుకు అంజయ్య, తాసీల్దార్ మురళి, ఎంపీడీఓ యాదగిరి, మెడికల్ ఆఫీసర్ అరుంధతి, మండల ప్రత్యేకాధికారి వెంకయ్య పాల్గొన్నారు.
అంధత్వ నివారణ కోసమే కంటి వెలుగు -ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
నల్లగొండ : అంధత్వం నివారణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు చేపట్టిందని కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 42వ వార్డులోని ఐఎంఏ భవన్లో కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డితో కలిసి కంటి వెలుగును ప్రారంభించి అనంతరం కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలు కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ కొండల్ రావు కంటి వెలుగుపై రచించించిన పాటను ఎమ్మె ల్యే, కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అలాగే కనగల్, తిప్పర్తి, నల్లగొండ మండలం దండంపల్లిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, మున్సిపల్ కమిషనర్ కేవీ రమ ణాచారి, కనగల్‌లో ఎంపీపీ, జడ్పీటీసీలు కరీం పాషా, చిట్ల వెంకటేశం, సర్పంచ్ నర్సింగ్ సునీతాక్రిష్ణయ్య గౌడ్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జాన్ శాస్త్రీ, పీఏసీఎస్ చైర్మన్ దోటి శ్రీనివాస్, డాక్టర్లు వరూధిని, తేజస్విని, ఎంపీటీసీ పాలకూరి సైదు లు, తాసీల్దార్ శ్రీనివాస రావు, ఎంపీడీఓ సోమసుందర్ రెడ్డి, దండంపల్లిలో ఎంపీడీఓ శ్రీనివాస రెడ్డి, తాసీల్దార్ నాగార్జునరెడ్డి, సర్పంచ్ చింత పుష్పలత, ఎంపీఓ మాధవ రెడ్డి, నాయకులు దేప వెంకట్‌రెడ్డి, బకరం వెంకన్న, గాదె రాంరెడ్డి, సంకు ధనలక్ష్మి కౌన్సిలర్లు పబ్బు సాయిశ్రీ సందీప్, అభిమన్యు శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, మాలె శరణ్యా రెడ్డి, సింగం లక్ష్మి, సందినేని జనార్దన్‌రావు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
మునుగోడు : అంధత్వ నివారణ కోసమే సీఎం కేసీఆర్ కంటి వెలుగును చేపట్టారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబి రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మన ఇంటి వద్దకే మన ఆరోగ్యం అనే నినాదంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ 100 రోజుల పాటు కంటివెలుగుకు శ్రీకారం చుట్టారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్, నారబోయిన స్వరూపరాణి, సర్పంచ్ మిర్యాల వెంకన్న, నోడల్ అధికారి రాజేందర్‌రెడ్డి, ఎంపీడీఓ జానయ్య, తాసీల్దార్లు కృష్ణారెడ్డి, సైదులు, ఎంపీఓ సుమలత, డాక్ట ర్ జమీల్, వైస్ ఎంపీపీ అనంత వీణా,ఎంపీటీసీలు ఈద నిర్మల, బొడ్డు శ్రావణి పాల్గొన్నారు.