రామన్నపేట: పాడి రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. ఇటీవల మదర్ డెయిరీ పాలకవర్గం ఎన్నికల్లో గెలుపొందిన చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి, డైరక్టర్లతో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వెస్ట్మారెడుపల్లిలోని ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పాడిపరిశ్రమ అభివృద్ధితో పాటు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని విధాలు గా చేయూతనందిస్తుందని, పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభి వృద్ధి సాధించేలా కృషి చేయాలన్నారు. అనతరం మంత్రిని నూతన కార్యవర్గ సభ్యులు శాలువా, పూలమాలతో సత్కరిం చారు. మంత్రిని కలిసిన వారిలో డైరక్టర్లు సురేందర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, సోమిరెడ్డి, శ్రీకర్‌రెడ్డి, శ్రీశైలం, వెంకట్రాంరెడ్డి, జయశ్రీ, అలివేలు, ఎండీ అశోక్‌కుమార్ తదితరులు ఉన్నారు.