చిలుకూరు, ఏప్రిల్ 15 : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామచంద్రనగర్లో భావిలోకి దూకి తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రామచంద్ర బుడిగం వీరమ్మ తన కొడుకు నాగేశ్వర్రావు మూగ వ్యక్తి కావడం, ఆరోగ్యం సహకరించకపోవడంతో తమను ఎవరు సాకుతారు అనే బెంగతో సోమవారం రాత్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.