దేవరకొండ, నవంబర్ 17 : ముస్లిం మత పెద్ద మహమ్మద్ జావీద్ హుస్సేన్ కాశ్మీ సాహెబ్ మృతి బాధాకరమని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణం హుస్సేన్ మృతదేహాన్ని వారు సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలోని ముస్లిం మత పెద్ద మహమ్మద్ జావిద్ హుస్సేన్ చేసిన సేవలను కొనియాడారు. అనంతరం గార్లపాటి దామోదర్ భార్య ఇటీవల మృతి చెందడంతో దామోదర్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట పీఏసీఎస్ చైర్మన్ వేణుధర్ రెడ్డి, జాల నరసింహారెడ్డి, ఆలంపల్లి నరసింహ, పున్న వెంకటేశ్వర్లు, వర్త్య దేవేందర్ నాయక్, యూనుస్, తౌఫిక్ ఉన్నారు.