మునుగోడు, జూన్ 03 : మన కష్టం మనం చేసుకుంటూ ఆత్మగౌరవంతో జీవించేదే వ్యసాయమని, సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ రైతులు అధిక దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. మునుగోడు మండల కేంద్రంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువ రైతులకు పంటల సాగు మెలకువలపై ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన యువ రైతుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యానవన శాఖ, రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా దశల వారీగా పరిస్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఆధునిక పద్థతిలో వ్యవసాయం చేస్తూ ఎక్కువ దిగుబడిని సాధిస్తున్న యువ రైతులను ఎమ్మెల్యే సన్మానించారు. ఈ సమావేశంలో ఆధునిక పద్థతులను అనురిస్తూ సాగు చేస్తూ ఆధిక దిగుబడిని,ఆధిక రాబడిని పొందుతున్న యువరైతుల విజయగాథలను ఇతర రైతులకు పరచయం చేశారు. ఉద్వానవన శాఖ సలహాలు, సూచనలతో వ్యవసాయం చేస్తే అధిక రాబడి పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ, వ్యవసాయశాఖ అధికారులు, ప్రజా ప్రనిదులు, యువ రైతులు పాల్గొన్నారు.
Munugode : సాగులో ఆధునిక పద్ధతులు అవలంభించాలి : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి