తరగతి గదిలోనే సమాజ నిర్మాణం
తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్‌కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు.
- ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
నిడమనూరు, మార్చి 10 : తరగతి గదిలోనే సమాజ నిర్మాణం ప్రారంభమవుతుందని, విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్‌కు బాటలు వేసిన పాఠశాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి లో పాఠశాల స్థల, అభివృద్ధి దాతలు మేరెడ్డి రామకృష్ణారెడ్డి, గార్లపాటి రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల విశిష్టతను తెలిపే అక్షర ప్రత్యేక సంచికను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1954 లో నిజాం ప్రభుత్వం విలీనం అనంతరం ఎర్రబెల్లి పరిసర గ్రామాల్లో విద్యావశ్యకతను గుర్తించి పాఠశాల, వసతి గృహాన్ని ఏర్పాటు చేయగా మేరెడ్డి రామకృష్ణారెడ్డి ఐదెకరాల స్థలాన్ని విరాళంగా అందజేయడం చారిత్రాత్మకమన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం విద్యాబుద్దుల నేర్పించాలన్న సంకల్పంతో సహకరించడం చారిత్రాత్మకమన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నందికొండ రామేశ్వరీమట్టారెడ్డి, ఎంపీటీసీ మొల్క సుగుణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, పూర్వ ప్రధానోపాధ్యాయుడు రామారావు, దాతల కుటుంబీకులు మేరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, జ్యోతి, వనజ, నిర్మల, గార్లపాటి సుధాకర్ రెడ్డి, పూర్వ విద్యార్థ్ధులు జూలకంటి అశోక్‌రెడ్డి, సురుగురు శ్రీనివాస్ రెడ్డి, నందికొండ మట్టారెడ్డి, మీసాల శ్రీనివాస్ తదితరులున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

