నీలగిరి, ఫిబ్రవరి 5: బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ప్రత్యేక చొరవతో రూ.1300 కోట్ల నిధులు తెచ్చి నల్లగొండ పట్టణాన్ని అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్తోనే నల్లగొండ అభివృద్ధి సాధించిందని, ఈ రెండేళ్లలో మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి నల్లగొండకు చేసిందేమిటని ప్రశ్నించారు. కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు గురువారం 47,48 డివిజన్ల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సింగం లక్ష్మీరామ్మెహన్, చకిలం వసంతలక్ష్మీ అనిల్‌కుమార్‌ను గెలిపించాలని కో రుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడు తూ నాడు నల్లగొండపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి రూ.1300 కోట్లు విడుదల చేయడం, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయడం వల్లే కార్పొరేషన్ అర్హత వచ్చిందని స్పష్టం చేశారు.
20ఏండ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి మున్సిపాలిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో జిల్లా కేంద్రం పల్లెటూరులా ఉండేదన్నారు. కేసీఆర్ వచ్చాకనే నల్లగొండను సుందర నగరంగా తీర్చిదిద్దామన్నారు. కేసీఆర్ దత్తత తీసుకొని అభివృద్ధి చేశారన్నారు. పట్టణంలో ఐటీ హబ్, మెడికల్ కళాశాల, రోడ్ల అభివృద్ధి, తాగునీరు, శానిటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ట్రాఫిక్ జంక్షన్ల నిర్మాణం చేపట్టామన్నారు. ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌ను మంత్రి క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నారని ఆరోపించారు. ఫ్లై ఓవ ర్, ఔటర్ రింగ్ రోడ్డు పనుల కాంట్రాక్టర్లను బెదిరించి వసూళ్లు చేసి, ఆ డబ్బుతో సూల్ నిర్మించి తమ పేర్లు పెట్టుకున్నారని విమర్శించారు.
ఎన్జీ కళాశాల అభివృద్ధికి రూ.36 కోట్ల నిధులు తీసుకొచ్చామని, ఆ పనులకు ఇంకా నిధులు అవసరమైనా పైసా కూడా తేవడం లేదన్నారు. కళాభారతి అభివృద్ధికి రూ.90 కోట్లు మంజూరైనా ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని భూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధి పనులకు ఇప్పటివరకు టెండర్లు ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. నల్లగొం డకు రోజు తప్పించి రోజు తాగునీరు ఇచ్చామన్నారు. పట్టణ రూపురేఖలు మార్చిన బీఆర్ఎస్ను కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో చకిలం అనిల్‌కుమార్, నిరంజన్ వలి, కంచర్ల కృష్ణారెడ్డి, చీర పంకజ్ యాదవ్, సింగం రామ్మోహన్, దేప వెంకటరెడ్డి, మాజీ జడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, సింగారపు విజయ్, తదితరులు పాల్గొన్నారు.