నిడమనూరు, జూన్ 17 : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎం.సీ.కోటిరెడ్డి వ్యక్తిగత డ్రైవర్ ఉప్పునూతల నర్సింహ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో మృతిచెందాడు. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన నర్సింహ బైక్‌పై స్వగ్రామం వెళ్లి వస్తుండగా వేంపాడ్ గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చనిపోయాడు. ఎమ్మెల్సీతో పాటు నర్సింహ్మ మిత్రుల సహకారంతో రూ.4.52 లక్షలను సేకరించారు. ఈ నగదు చెక్కును మంగళవారం మిర్యాలగూడలోని నర్సింహ్మ కుటుంబానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డి అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు అల్లి పెద్దిరాజు యాదవ్, నిడమనూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కేశబోయిన జానయ్య గౌడ్, పీసీకే ప్రసాద్, కిశోర్ నాయక్, షరీఫ్, తెనాలి సుధాకర్‌రెడ్డి, ఎంసీకేఆర్ యువసేన నాయకులు రవీంద్రాచారి, గడ్డమీది నాగార్జున, రాంజీ, శేఖర్ పాల్గొన్నారు.