పెద్దవూర, జులై 11 : నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామ పంచాయతీ పరిధి ఏనెమీదిగూడెం గ్రామానికి చెందిన పందుల నాగయ్య కుమార్తె వైష్ణవి అనారోగ్యంతో బాధపడుతుంది. సర్జరీకై హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న కుటుంబ స్థితిని ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన రూ.2 లక్షలకు ఎల్ఓసీ మంజూరు చేయించారు. శుక్రవారం అట్టి పత్రాలను బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గన్నెపాక లక్ష్మణ్ పాల్గొన్నారు.