పాలకవీడు, మార్చి 13 : జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జానపహాడ్ దర్గా నందు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులడు రాపోలు నవీన్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ షోయబ్ ఆధ్వర్యంలో దర్గా నందు పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాపోలు నవీన్ కుమార్ మాట్లాడుతూ.. బతుకమ్మతో తెలంగాణ సంప్రదాయాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి కవిత అన్నారు. కవితక్క జానపహాడ్ సైదన్న ఆశీస్సులతో మరెన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరిత సేన ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ ఇంజమూరి రాజేశ్, పాలకవీడు మహిళా అధ్యక్షురాలు మమత, అంజి యాదవ్, గుర్రాల శ్రీకాంత్, ముస్తాక్, శ్రీను నాయక్, రాజశేఖర్, నాగుల్ మీరా, మేష్ నాయక్, షేక్ బాబు, శూన్యంపహాడ్ గ్రామ పార్టీ అధ్యక్షుడు అశోక్ నాయక్, జాన్‌పహాడ్ దర్గా గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్, రమేశ్ నాయక్, రవి నాయక్ సాయి చరణ్, సైదులు, కిషోర్, వెంకటేశ్వర్లు, వి.కిరణ్, టోనీ, జోసెఫ్ పాల్గొన్నారు.