మహిళా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
చిట్యాల, జనవరి 11 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 73 మంది లబ్ధిదారులకు గురువారం ఆయన చిట్యాలలో చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం కట్టుబడి ఎన్నికల హామీలన్నింటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నదని వివరించారు. ప్రజలకు తాగునీరందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నాకు
నేరుగా తెలుపాలని సూచించారు.
నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందని మండల సర్వసభ్య సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేక చర్చ జరిగిందని తెలిపారు. మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జడ్పీటీసీ సుంకరి ధనమ్మ, తాసీల్దార్ దశరథ, సర్పంచులు అంతటి వెంకటేశం, జనగాం రవీందర్, కంచర్ల శ్రీనివాస్రెడ్డి, రత్నం పుష్ప, మేడి లింగమ్మ, ఎంపీటీసీలు సత్తయ్య, కౌన్సిలర్లు జడల పూలమ్మ, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాటం వెంకటేశం, పోకల దేవదాసు, జిట్ట చంద్రకాంత్, బట్టు అయిలేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

