కాంగ్రెస్‌కు ఓటు వేసి కష్టాల పాలవ్వొద్దు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దని, కష్టాలపాలు కావొద్దని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండమడుగులో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
- సీఎం కేసీఆర్ పాలనలోనే మరింత అభివృద్ధి
- ఎవరెన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే విజయం
- ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి
బీబీనగర్, నవంబర్ 4 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దని, కష్టాలపాలు కావొద్దని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొండమడుగులో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. అభివృద్ధి చెందిన రాష్ర్టాన్ని నాశనం చేయడానికి కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారన్నారు.

మోసపూరిత హామీలను ఇస్తూ, ఎవరెన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌గౌడ్, భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీర ఐలయ్య, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, అశోక్, కిరణ్, మున్నా పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

