భువనగిరి అర్బన్, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ, మండలానికి చెందిన 124 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెకులు, సొంత నిధులతో పోచంపల్లి పట్టుచీర, దోతి, టవల్‌ను లబ్ధిదారులకు కానుకగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భువనగిరి పట్టణం, మండలానికి కలిపి మొత్తం 124 చెకులకు గాను సుమారు 1 కోటి 25 లక్షలకు పైగా పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్‌రెడ్డి, ఎంపీపీ నరాల నిర్మాలావెంకటస్వామి, జడ్పీటీసీ బీరు మల్లయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ, మండలాధ్యక్షులు ఏవీ.కిరణ్‌కుమార్, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.
భువనగిరి అర్బన్ : భూదాన్‌పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో గల ఎరుకల నాంచారమ్మ తల్లి బోనాల జాతర ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించారు.
భూదాన్ పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లి గ్రామంలో ఎరుకల నాంచారమ్మ దేవాలయంలో మే 1 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించే ఎరుకల నాంచారమ్మ జాతరకు రావాలని తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుతాడి రాములు, జిల్లా అధ్యక్షుడు కూతాడి సురేశ్ బుధవారం భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జాతర పోస్టర్, ఆహ్వాన పత్రికను విడుదల చేశారు.
బీబీనగర్ : మైనార్టీల అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జామా మసీదు ఆవరణలో ముస్లిం కుటుంబాలకు తన సొంత నిధులతో ఎమ్మెల్యే రంజాన్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలు భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్పర్సన్, జడ్పీటీసీ గోలి ప్రణితాపింగల్రెడ్డి, సర్పంచ్ మాలగారి భాగ్యలక్ష్మీశ్రీనివాస్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండీ అక్బర్, ఉప సర్పంచ్ దస్తగిరి, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్‌రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నారగోని మహేశ్, నాయకులు గుంటిపల్లి లక్ష్మీనారాయణ, ఎండీ మోయిన్, మైనారిటీ సెల్ పట్టణాధ్యక్షుడు మస్తాన్, మంచాల నరహరి, మిట్టు, ఫరీద్, ఖలీల్, బఫీర్, ఖాజా చోటు పాల్గొన్నారు.