కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ రాంబందుల రాజ్యం వస్తుందని, తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతాయని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైళ్ల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ పథకాలు భూటకమని, జనాన్ని మోసం చేయడానికి పన్నిన ఎత్తుగడ అని అన్నారు. మరింత అభివృద్ధి జరుగాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ
మెజార్టీతో గెలిపించాలని కోరారు.
భూదాన్‌పోచంపల్లి, నవంబర్ 11 : కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ప్రజల బతుకులు ఆగమవుతాయని, రాబంధుల రాజ్యమవుతుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలో అంతమ్మగూడెం, దోతిగూడెం, జిబ్లక్‌పల్లి, దంతూరు, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, శివారెడ్డిగూడెం, జలాల్పురం, మెహర్‌నగర్, భీమనపల్లీ, కనుముకుల గ్రామాల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో డప్పు వాయిద్యాలతో ప్రజలు జననీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్ షో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే కటిక చీకటిని, ఆరు గ్యారెంటీ పథకాలు పచ్చి భూటకమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అందరూ సీఎంలేనని, ప్రజా సమస్యలు పట్టవని చెప్పారు. ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తుందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటు వేయాలని కోరారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి వెనుక చంద్రబాబునాయుడు ఉన్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో నియోజవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భువనగిరి గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయునున్నట్లు తెలిపారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్,
రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్ కొలుపుల అమరేందర్, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాటి సుధాకర్‌రెడ్డి, చిలువేరు బాలనరసింహ, సర్పంచ్ ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షులు సామ రవీందర్‌రెడ్డి, బత్తుల మాధవీశ్రీశైలంగౌడ్, మారెట్ డైరెక్టర్లు ముత్యాల మహిపాల్‌రెడ్డి, పగిళ్ల సుధాకర్‌రెడ్డి, సర్పంచులు వస్పరి పారిజాతామహేశ్, పగిళ్ల స్వప్నారాంరెడ్డి, దోటి కుమార్, పిసర్ల మంజుల మైపాల్‌రెడ్డి, కోట అంజిరెడ్డి, పర్ని రజితామల్లారెడ్డి, సిర్పంగి స్వాతి, కంటె రాములు, రావుల శ్రీదేవి, ఆర్ల లింగస్వామి, నాయకులు కాసుల చిన్నసత్తయ్య, గోరుగంటి ముత్యాలు, ముద్దం సత్యం, మందాడి మహేందర్‌రెడ్డి, సుర్వి శివకుమార్, కాటం రాజు, సరసని నర్సిరెడ్డి, పీసర్ల రవీందర్‌రెడ్డి, వారాల రామచంద్రారెడ్డి, సురంటి జంగారెడ్డి, ఆర్ల వెంకటేశం, బోదాసు సత్తయ్య, శ్రీశైలం పాల్గొన్నారు.