పెద్దవూర, నవంబర్ 20: బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాస్‌లు అని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని తెప్పలమడుగు, లింగంపల్లి, పెద్దగూడెం, చిన్నగూడెం, శిర్సనగండ్ల, తమ్మడపల్లి, కోత్తలూ రు, బసిరెడ్డిపల్లి, వెల్మగూడెం, గర్నెకుంట, బట్టుగూడెం, పిన్నవూర, సంగరం, ముసలమ్మచెట్టు, చింతపల్లిగేటు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యేకు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి మాత్రం బాస్‌లు ఢిల్లీలో గులాములు అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే అభివృద్ధి ప్రారంభమైందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాయ మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. కేసీఆర్ మూడో సారి సీఎం కాగానే నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని ఆరోపించారు.
ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయాలని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్‌నాయక్ అన్నారు. గత ప్రభుత్వాలు ఏ ఒక్క వర్గం వారి అభివృద్ధిని ఆలోచించలేదని తెలిపారు. అన్నివర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా పనిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ గతంలో ప్రజల సంక్షేమం గురించి ఎందుకు పట్టించుకోలేదో ఆత్మవిమర్శ చేసుకోవా లని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ గుంటక వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జటవత్ రవినాయక్, ప్రధాన కార్య దర్శి కర్నాటి మునిరెడ్డి, మైనార్టీ నియెజకవర్గ అధ్యక్షుడు షేక్ అబ్బస్, బీఆర్ఎస్ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి షేక్ బషీర్,కర్ణ బ్రహ్మరెడ్డి, మాల్లారెడ్డి, నల్లమెట్టి కృష్ణయ్య, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
హాలియా: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండున్నరేండ్లలోనే అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నా రు. సోమవారం అనుముల మండలం పాలెం, మార్లగడ్డగూడెంకి చెందిన 50, పెద్దవూర మం డలం పర్వేదుల, గర్నేకుంటకి చెందిన 40 కాంగ్రెస్ పార్టీ కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే భగత్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెలే భగత్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లోకి చేరుతున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే ప్రజలు కరెంట్ కష్టాలను కొనితెచ్చుకోవడమేనని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జవ్వాజి వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, జఠవత్ రవినాయక్, రాష్ట్ర కార్యదర్శి షేక్ బషీర్, యూత్ అధ్యక్షుడు కాట్నం నాగరాజు, ఉప సర్పంచ్ పగిళ్ల వెంకన్న, మండల కోశాధికారి గౌరు సాయి, యూత్ అధ్యక్షుడు మెండే సైదులు, షేక్ అబ్బాస్, నడ్డి సత్యం తదితరులున్నారు.
గుర్రంపోడు : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 25కుటుంబాలు మండల ఉపాధ్యక్షుడు వెలుగు రవి, మండల యూత్ అధ్యక్షుడు కుప్ప పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భగత్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లోకి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే భగత్ బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. పార్టీలో చేరినవారిలో గౌడ సంఘం గుర్రంపోడు గ్రామ అధ్యక్షుడు రావుల అంజయ్య, వనమాల మహేందర్,శంకర్, చెవిటి లింగయ్య, ఆలేటి యాదగిరి, కడమంచి మహేష్, తగుళ్ల మహేష్, తగుళ్ల రమేష్, బాషం యాదగిరి, చిత్రం ఉమేష్, చంటి, మహేష్, యాదయ్య ఉన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల యాదయ్య, మేకల వెంకట్‌రెడ్డి,షేక్ అమీర్, మేడి లింగయ్య, షేక్‌సయ్యద్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.