హాలియా, నవంబర్ 30: నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈ సారి కూడా బీఆర్ఎస్ పార్టీదే విజయమని ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం హాలియా మున్సిపాలిటీలోని ఇబ్రహీంపేటలో గురువారం ఎమ్మెల్యే భగత్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల్లో ఓటే వజ్రాయుధం అని అన్నారు. ఓటర్లు తమకు నచ్చిన నాయకుని ఎన్నుకునేందుకు ఓటు హక్కు ద్వారా వీలు కలుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఓటర్లు ఆలోచించి పనిచేసే ప్రభుత్వానికి ఓటేసి అభివృద్ధికి పట్టం కట్టాల్సిందిగా ఆయన కోరారు. ఆయన వెంట యడవల్లి మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.