మిర్యాలగూడ రూరల్, అక్టోబర్ 18 : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ది, సంక్షేమాన్ని చూడాలని.. మరింత అభివృద్ధికి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. దామరచర్ల మండలంలో ఎమ్మెల్యే రెండో రోజు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. బుధవారం కేశవాపురం, రామోజీతండా, దనియాలబండతండా , మాన్తండా, నూనావత్తండా, ఎల్బీతండా, సాత్‌తండా, మంగల్దుబ్బతండా, లావూరితండా, తెట్టెకుంట, జైత్రాంతండా, బొత్తలపాలెం, వీర్లపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే విస్తృత ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గిరిజన తండాల పరిస్థితి, రాష్ట్రం ఏర్పడ్డాక పరిస్థితిని పరిశీలించి బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి ముచ్చటగా మూడోసారి రాష్ట్ర పాలన చేపట్టేలా చూడాలని కోరారు. రాష్ట్ర సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ల నుంచే గిరిజన తండాల బాగోగులుపై అధికారులు, నాయకులతో ఆరా తీస్తూ వాటి అభివృద్ధిపై చర్చించినట్లు చెప్పారు. గిరిజన తండాలు స్వాతంత్య్ర గ్రామ పంచాయతీలుగా ఏర్పడితే బాగుబడతాయని ఆశించిన సీఎం 500 జనాభా దాటిన ప్రతి గిరిజన తండాను గ్రామ పంచాయతీగా మార్చినట్లు వివరించారు.
కేశవాపురం, రామోజీతండా, ఎల్బీ తండా, సాత్‌తండా, మంగల్దుబ్బతండా, లావూడితండా, తెట్టెకుంట, జైత్రాంతండా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ వజీరాబాద్ మేజరు కింద టెయిలెండ్ భూములు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు సక్రమంగా సాగునీరు అందేది కాదని ఎమ్మెల్యే అన్నారు. సాగునీటి సమస్య చెప్పగానే రైతుల భాధలు తెలిసిన సీఎం కేసీఆర్ మూసీ నదిపై చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతో పాటు రూ.100 కోట్లతో లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు అవి పూర్తయితే సాగర్ కాల్వ నీటితో పనే లేదని, ఈ ప్రాంతమంతా సస్యశ్యామలం కానున్నట్లు చెప్పారు. నూతంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసిందన్నారు. తండాలను కలుపుతు తారు రోడ్లు, తండాల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా చేసినట్లు తెలిపారు. తండాల్లో వంద శాతం మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, పల్లె పకృతి వనాలు, డంపింగ్ యార్డులు, ప్రతి తండా గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ఇవన్నీ ఈ పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో జరిగినవి కాదా అని ప్రశ్నించారు. కారు గుర్తుకే ఓటు వేసి మరింత అభివృద్ధిని కాంక్షించాలని కోరారు.
తండాల అభివృద్ధికి
కేశవాపురం, రామోజీతండా, లావూడి బిక్యాతండాల అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం రూ.97.7 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కేశవాపురంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.80.30 కోట్లు, లావూడి బిక్యాతండాల అభివృద్ధికి రూ.2.70 కోట్లు, నూనావత్తండా అభివృద్ధికి రూ.4.22 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు.
4 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణం సాగుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వల్ల వీర్లపాలెం గ్రామానికి మేలు జరుగుతుందన్నారు. గ్రామ రైతుల భూములు ప్లాంట్ కింద పోగా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత నష్ట పరిహారం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. మిగిలిన భూములకు సాగునీరు అందించే విధంగా లిఫ్ట్‌లను చేపట్టినట్లు చెప్పారు. లిఫ్ట్ పూర్తయితే రైతుల దశ మారుతుందన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. వీర్లపాలెం గ్రామంలో యాదవులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బొత్తలపాలెం గ్రామాభివృద్ధికి నిధులు హెచ్చించినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి, ఈ అభివృద్ధి కొనసాగేలా మరోసారి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ రాష్ట్ర పాలన చేపట్టే అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మిర్యాలగూడ మార్కెట్ చైర్మన్ బైరం సంపత్‌కుమార్, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, ఎంపీపీ ధీరావత్ నందినీరవితేజ, వైస్ ఎంపీపీ కటకం సైదులురెడ్డి, జడ్పీటీసీ ఆంగోతు లలితాహతీరాంనాయక్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దారగాని వెంకటేశ్వర్లు, పడిగపాటి కోటిరెడ్డి, డీలర్ కోటిరెడ్డి, సర్పంచ్ గుగులోతు సైదానాయక్, దస్లీ, శ్రీనునాయాక్, ఎంపీటీసీలు సీతారాములు, లింగానాయక్, శ్రీను, సాయన్న, శోభన్‌బాబు, మనోహర్ పాల్గొన్నారు.