సూర్యాపేట, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : ఎంపీ బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోకపోతే చీల్చి చెండాడుతామని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. శనివారం సూర్యాపేట జిల్లాకేంద్రంలో జర్నలిస్టు శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మహిళా సమాజాన్ని కించపరిస్తే బండి సంజయ్ బట్టలూడదీసి కొడుతారని హెచ్చరించారు. మహిళలను కించపరిచే బండి సంజయ్ నోరును ఫినాయిల్‌తో కడగాలన్నారు. హహిళలను గౌరవించలేని అధ్యక్షుడున్న దౌర్భాగ్యపు పరిస్థితి బీజేపీకి ఏర్పడిందని పేర్కొన్నారు.
ఈడీ ఏం చేసేది బీజేపీ నేతలకు ముందే ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బీజేపీ చేతిలో దర్యాప్తు సంస్థలు కీలు బొమ్మలనడానికి వారి ముందస్తు వ్యాఖ్యలే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ చేస్తున్న అన్యాయాలను ఎదిరిస్తే కేసులు పెడుతారా అని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన తాము భయపడమని పేర్కొన్నారు. బీజేపీతో లీగల్గానైనా, ఉద్యమం ద్వారా నైనా తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.