కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి సాధిద్దాం
కలిసికట్టుగా పనిచేసి మండలాభివృద్ధి సాధిద్దామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎంపీపీ అనుముల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
- మండల సమావేశంలో ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డి
త్రిపురారం, డిసెంబర్ 24: కలిసికట్టుగా పనిచేసి మండలాభివృద్ధి సాధిద్దామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎంపీపీ అనుముల శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.
జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్ మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరగా పై అధికారులతో మాట్లాడి చెప్తామన్నారు. పెద్దదేవులపల్లి ఎంపీటీసీ అంబటి రాము మాట్లాడుతూ మిషన్ భగీరథ రావడం లేదని, ఎన్నిసార్లు ప్రస్తావించినా లాభం లేదన్నారు. అంజనపల్లి రెవెన్యూ శివారులోని 335 సర్వే నెంబర్లో పట్టాలు ఇప్పించాలని సర్పంచ్ రెవెన్యూ అధికారులను కోరారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.
బయటి వ్యక్తులు హాజరు..
సర్వసభ్య సమావేశానికి సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు సంబంధం లేని కొందరు బయటి వ్యక్తులు సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. మహిళ సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో వారి భర్తలతో పాటు ఆయా గ్రామాల నుంచి ఎమ్మెల్యేను కలవడానికి వచ్చిన వారంతా సర్వసభ్య సమావేశంలో కూర్చొన్నారు. కార్యక్రమంలో నిడమనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రారెడ్డి, జడ్పీటీసీ భారతీభాస్కర్నాయక్, తాసీల్దార్ గాజుల ప్రమీల, ఎంపీడీఓ అలివేలు మంగమ్మ, పీఆర్ ఏఈ వెంకట్‌రెడ్డి, ఎంపీఓ భిక్షంరాజు, అగ్రికల్చర్ ఏఓ పార్వతిచౌహాన్, ఏపీఎం అశోక్, పీహెచ్సీ డాక్టర్ రమావత్ శంకర్, పశువైద్యాధికారులు శశికళ, ఙ్ఞానేశ్వర్ప్రసాద్, అంగన్వాడీ సూపర్వైజర్లు రజిని, వరలక్ష్మి, ఆయా గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, మండల అధికారులు పాల్గొన్నారు.
పదవీకాలం పొడిగించాలని సర్పంచ్ల వినతి
కరోనా కాలంలో రెండేండ్లు వృథాగా పోయాయని, ప్రజలకు సేవ చేసేందుకు పదవీ కాలం పొడిగించాలని ఎమ్మెల్యే జయవీర్‌రెడ్డికి ఆయా గ్రామాల సర్పంచ్‌లు వినతిపత్రం సమర్పించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

