తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని, ఎన్నికల వేళ
సాధ్యంకాని హామీలు ఇచ్చే పార్టీలను నమ్మొద్దని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
మహేందర్‌రెడ్డి అన్నారు. బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ అన్ని వర్గాలకు మేలు చేసేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు విని అభివృద్ధిని దూరం చేసుకోవద్దని సూచించారు.
బొమ్మలరామారం, నవంబర్ 19 : ఆలేరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి తనను మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తూముకుంట, రంగాపురం, కొత్తరంగాపురం, పెద్ద పర్వతాపురం, సోలీపేట, జలాల్పూర్, రాంలింగంపల్లి, నాగినేనిపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో గ్రామాలు, గిరిజనతండాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయులో ఏర్పాటు చేశామని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ చెబుతున్న హామీలు నమ్మొద్దని, తెలంగాణ ప్రగతిని వేగవంతం చేయడానికి బీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మండలానికి గోదావరి జలాలు తేవడంతో వ్యవసాయం, భూగర్భ జలవనరులు అభివృద్ధి చెందాయని, సమాజంలోని అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారన్నారు. అర్హులైన దళితులకు దళిత బంధు ద్వారా లబ్ధి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సమస్యను శాశ్వతంగా తొలగించిన ఘనత సీఏం కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్‌గౌడ్, సుధగాని హరిశంకరగౌడ్, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, రెడ్డెబోయిన లక్ష్మీనర్సింహ, పూడూరీ నవీన్ గౌడ్, సంగిశెట్టి వెంకటేశ్, భట్కీర్ బీరప్ప, నాయకులు కుషంగల సత్యనారాయణ, గూదె బాలనర్సింహ, గుర్రాల లక్ష్మారెడ్డి, గొడుగు చంద్రమౌళి, జూపల్లి భరత్, రాంరెడ్డి, ఆంజనేయులు, శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.