నల్లగొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు లో BRS లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామపంచాయతీ రాయపురం గ్రామానికి చెందిన సుమారు 100 మంది వివిధ పార్టీల నాయకులు బొజ్జ అరవింద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చిరుమర్తి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే మార్గదర్శనీయమని పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషముగా ఉన్నారన్నారు.
పార్టీలో చేరిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు .పార్టీలో చేరిన వారిలో జోజప్ప మేరీ స్టెల్లా, వార్డు సభ్యులు, పసల ప్రేమ్ సాగర్, మాజీ ఉప సర్పంచ్ మాదాను లూర్దు కొండయ్య, సబీస్టెన్, పసల జోజప్ప, ప్రకాష్, మాదాను బాల కుమార్, పసల విజయ్, ఇన్నయ్య, పసల సుధారాణి, తదితరులు పాల్గొన్నారు.