రామన్నపేట, ఏప్రిల్ 24 : పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. రామన్నపేట-జైకేసారం గ్రామాల మధ్య రూ.4.15 కోట్లు, రామన్నపేట- లక్ష్మాపురం గ్రామాల మధ్య రూ.3.30 కోట్లతో చేపట్టిన పంచాయతీరాజ్ బీటీ రోడ్ల మరమ్మతు పనులకు సోమవారం ఆయన శుంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నియోజకవర్గంలో దెబ్బతిన్న బీటీ రోడ్ల మరమ్మతు పనులను దశల వారీగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 27 అవార్డుల్లో రాష్ర్టానికి 8 అవార్డులు రావడం ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. మండలంలో ఇప్పటికే కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి 4.70 కోట్ల ఎస్డీఎఫ్ నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలువాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మీజగన్‌మోహన్, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మండల కార్యదర్శి పోషబోయిన మల్లేశం, సర్పంచ్‌లు గుత్తా నర్సిరెడ్డి, అప్పం లక్ష్మీనర్సు, పిట్ట కృష్ణారెడ్డి, మెట్టు మహేందర్‌రెడ్డి, ఉప్పు ప్రకాశ్, రేఖ యాదయ్య, ముత్యాల సుజాత, ఎంపీటీసీలు తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, గొరిగె నర్సింహ, సుధీర్‌బాబు, బడుగు రమేశ్, ఉప సర్పంచ్ పొడిచేటి కిషన్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పోతరాజు సాయి, జాడ సంతోష్, నాయకులు దయాకర్, రాములు, రమేశ్, శంకరయ్య, మీర్జా ఇనాయత్ బేగ్, శ్రీధర్ పాల్గొన్నారు.