నకిరేకల్, ఏప్రిల్ 13 : రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భరోసానిచ్చారు. నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ యార్డు, చీమలగడ్డలోని నిమ్మ మార్కెట్ వద్ద, మండలంలోని మంగళపల్లి, తాటికల్, చందనపల్లి గ్రామాల్లో పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున ్నదన్నారు.కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీ నగేశ్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నకిరేకల్, కేతేపల్లి పీఏసీఎస్ చైర్మన్లు పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, బోళ్ల వెంకట్‌రెడ్డి, ఏపీఎం ప్రభాకర్, బీఆర్ఎస్ మండల, పట్టణాధ్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, యల్లపురెడ్డి సైదిరెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి