నార్కట్పల్లి : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామంలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన వైకుంఠదామం, డంపింగ్ యార్డ్, ఆరోగ్య ఉపకేంద్రం, పల్లె ప్రకృతివనం, రైతు వేదికల భవనాలను ప్రారంభించారు.
అనంతరం బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గ్రామంలోని రైతువేదిక వద్ద గ్రామ రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.