కేతేపల్లి, జూన్ 16 : రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశమంతా సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఉప్పలపహాడ్‌కు చెందిన వివిధ పార్టీల నుంచి 100 మంది శుక్రవారం నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తూ సీఎం కేసీఆర్ దేశంలోనే ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశం లేదన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్, నేడు దేశ ప్రజల కోసం జాతీయ పార్టీని స్థాపించినట్లు చెప్పారు. కేసీఆర్ ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో నకిరేకల్‌లో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలుస్తుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారిలో వడ్డె గణేశ్, జాని, చింత తేజ, బంటు వెంకటేశ్, రాకేశ్, వడ్డె నాగరాజు, నరేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, నాయకులు సురేశ్, మహేందర్, వేణుమాధవరెడ్డి, ముత్తయ్య పాల్గొన్నారు.