రాజాపేట, మార్చి 25 : తండ్రి మందలించాడని ఇంట్లో ఎవరికి చెప్పకుండా అదృశ్యమైన యువకుడు యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని మల్లెగూడెంలో శివారులోని గుట్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన యువకుడు రెడ్డబోయిన హరిబాబు అలియాస్ అభి తండ్రి మందలించాడని ఈనెల 21న ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు. గత మూడు రోజుల నుంచి యువకుడి ఆచూకీ కోసం బంధువుల ఇండ్లలో, ఇతర చోట్ల వెతకగా ఆచూకీ తెలియలేదు.
దాంతో తండ్రి మల్లయ్య స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ అనిల్ కుమార్ కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. కాగా, రాజాపేట మండలంలోని కొండ్రెడ్డి చెరువుకు రైతు కోతులను తరిమికొట్టే క్రమంలో యువకుడు చెట్టుకి వేలాడుతూ గమనించాడు. దీంతో మల్లెగూడం గ్రామస్తులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనలు చేరుకొని పంచనామ నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.