మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకు లు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధ వారం దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామ పంచాయితీ పరిధి దుబ్బతండాకు చెందిన 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దుర్గంపూడి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే భాస్కర్రావు సమక్షంలో పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ సంక్షేమ ఫలాలను అందరికి అందించి ప్రజారంజకమైన పరిపాలన చేస్తున్నారని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో రుపావత్ హన్యనాయక్, హనుమా, చిన్నహన్మ, నాగు, ధనావత్ గాంధి, పాతులోతు హరి, రూప్ల, తులస్య, మంగ్త, లావూరి రవి, సురేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాలునాయక్, కటికం సైదులు, చిట్టిబాబునాయక్, కోట్యనాయక్, హనిమిరెడ్డి, వినోద్నాయక్, ఆది నారాయణరెడ్డి, దత్తునాయక్ ఉన్నారు.