మిర్యాలగూడ, ఫిబ్రవరి 24 : మిర్యాలగూడ ఏరియా దవాఖానను 100 పడకల నుంచి 200 పడకల స్థాయికి పెంచనున్నట్లు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ ఏరియా దవాఖానను ఆయన సందర్శించి వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఏరియా దవాఖానలో త్వరలో రూ.15 కోట్లతో మరో 100 పడకల భవణ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
ఆస్పత్రిలో వసతుల గురించి ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య సిబ్బందిని హెచ్చరించారు. ఖచ్చితంగా సమయపాలన పాటించాలని, ప్రైవేటు అంబులెన్సులను ప్రోత్సాహించవద్దని సూచించారు. ఆయన వెంట దవాఖాన సూపరింటెండెంట్ శ్రీనివాస్ సమరద్, వైద్యులు పుల్లారావు ఉన్నారు.
దేవరకొండ : రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్ దేవరకొండ ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. పలు విభాగాలను పరిశీలించారు. ఆస్పత్రిలో సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డీసీహెచ్ మాత్రునాయక్, దవాఖాన సూపరింటెండెంట్ రాములునాయక్, వైద్యులు కృష్ణ, రవినాయక్, జవహార్‌లాల్, మోతిలాలునాయక్ పాల్గొన్నారు.