కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ మజర్ పాషాతోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు. అలాగే అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ భువనగిరి మండల మాజీ అధ్యక్షుడితోపాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు.
భువనగిరి అర్బన్, నవంబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిలో తాము భాగస్వాములు కావాలని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఏఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు షేక్ మజర్ పాషాతో పాటు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడక ముందు భువనగిరి నియోజకవర్గం ఏ విధంగా ఉందో.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందో కళ్లముందు కనబడుతుందన్నారు. అభివృద్ధికి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ అందాయన్నారు. సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుడు బీఆర్ఎస్ వెన్నంటి ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్‌గౌడ్, ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి, మండలాధ్యక్షుడు జనగాం పాండు, జిల్లా నాయకుడు ఎడ్ల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 3 : మండలంలోని అనంతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ మండలాధ్యక్షుడు సింగిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు 100మంది కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొబ్బల మీనారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ పల్లెపాటి నరసింహ, పోల రాములు, ముడుపుల శ్రీధర్‌రెడ్డి, కొండ వెంకటేశ్, పల్లెపాటి నరేందర్, మచ్చ రమేశ్, పోల నవీన్, మచ్చ రాజు, మచ్చ సతయ్య, కొండం వసంత, కొంగల అండాలు, ఏడ్ల జంగమ్మ, పిడుగు యశోద ఉన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, సర్పంచ్ చిందం మల్లికార్జున్, ఎంపీటీసీ సామల వెంకటేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు బొట్టు మల్లేశం, ర్యాకల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ విట్టల్ రఘురామయ్య, మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత, పొట్ట లావణ్య, యూత్ మండల ప్రధాన కార్యదర్శి పోల ప్రవీణ్‌కుమార్, చిందం హరిబాబు, చిగురుపల్లి సోమయ్య, ఒగ్గు శివకుమార్, గుమ్ముల మధు, పల్లెపాటి కొండల్, మధిర వినోద్, గుమ్ముల ప్రవీణ్, కొంగల వెంకటేశ్, రాంపల్లి అంజన్ కుమార్, బండిరాళ్ల బలరాం, తకల్లా అశోక్, సోమన రాజు, పల్లెపాటి అంజయ్య, ఏడ్ల నాగరాజు, రాంపల్లి అంజన్‌కుమార్, సురేందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : మండలంలోని ఇంద్రియాల గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారిలో పట్నం గణేశ్, పట్నం నరేశ్, పట్నం శివ, మాకోలు హరిశంకర్, మాకోలు సుధీర్, పావిరాల బాలకృష్ణ ఉన్నారు. అదే విధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి వర్గం గౌస్‌కొండ గ్రామ నాయకుడు గుర్రం శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, ఎంపీపీ మాడుగుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలతామల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేశ్‌యాదవ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కందాడి భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పెద్దిరెడ్డి యాదగిరి, మాజీ సర్పంచ్ బండి కృష్ణ, మారెట్ కమిటీ మాజీ డైరెక్టర్ నోముల మాధవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.