అడ్డూ అదుపులేని కాంగ్రెస్ నాయకుల అవినీతి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా - తథా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు.
నందికొండ, ఏప్రిల్ 06 : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథా రాజా – తథా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. దీనిని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే చట్టాన్ని చేతిలోకి తీసుకునే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. సోమవారం నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నియోజకవర్గంలో విచ్చలవిడిగా గంజాయి, పేకాట, ఇసుక మాఫియా, బెట్టింగ్ నడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అవినీతి పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలను అరికట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల తరఫున నిలబడి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అనుముల మండల అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ చెన్ను సుందర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ హిరేకార్ రమేష్,7వ వార్డు ఇన్చార్జి సయ్యద్ మక్సూద్, 9వ వార్డు ఇన్చార్జి బత్తుల శేఖర్ బాబు, 10వ వార్డు ఇన్చార్జి కోడా విజయ్, 2వ వార్డు ఇన్చార్జి మహమ్మద్ గని, మాజీ వైస్ చైర్మన్ ఆదాసు విక్రమ్, పార్టీ నాయకులు అర్జున్ నాయక్, శివ, మహేశ్ నాయక్, మన్సూర్, నజీర్, రవి, నజీర్, షరీఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

