కోదాడ, జూన్ 20 : రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో పీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్షీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ పారా సీతయ్య పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి ఉత్తమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
స్థానిక ప్రభుత్వ దవాఖానాలో మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగా థియేటర్ ఎదుట అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపూరి తిరుపతమ్మ, సుధీర్, వైస్ చైర్మన్ బషీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, సీహెచ్ శ్రీనివాసరావు, రహీం, గంధం యాదగిరి, షాబుద్దీన్, కారింగుల అంజన్‌గౌడ్, బాజాన్, చక్కర చిన్నపరెడ్డి, నీల సత్యనారాయణ, జయప్రకాశ్, బ్రహ్మయ్య, వెంపటి మధుసూదన్, డాక్టర్ దశరథ, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Kodada : కోదాడలో ఘనంగా మంత్రి ఉత్తమ్ జన్మదిన వేడుకలు