చౌటుప్పల్, అక్టోబర్ 20 : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం రానున్నారు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రోడ్ షో ప్రారంభం కానున్నది.
చౌటుప్పల్‌లోని చిన్నకొండూరు చౌరస్తాలో ప్రజలనుద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడనున్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొననున్నట్లు మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు తెలిపారు.