చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి
ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుకలు వేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
- రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నీలగిరి, మార్చి 3 : ఐదేండ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుకలు వేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయన జిల్లా కేంద్రంలోని మాన్యంచెల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో చిన్నారులకు పోలియో చుకలు వేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు అంగ వైకల్యం బారిన పడకుండా పిల్లలను రక్షించుకునేందుకు తప్పనిసరిగా పోలియో చుకలు వేయించాలన్నారు. అంతకుముందు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చిన్నారులకు పోలియో చుకలను వేశారు. కార్యక్రమాల్లో కలెక్టర్ దాసరి హరిచందన, డీఎంహెచ్ఓ డాక్టర్ కొండల్రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఇమ్యూనజేషన్ అధికారి డాక్టర్ జమీర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నిత్యానంద, ఎంసీహెచ్పీఓ డాక్టర్ అరుంధతి రెడ్డి పాల్గొన్నారు.
పోలియో నిర్మూలనకు కృషి చేయాలి : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ : పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిన్నారులకు ఆయన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ కేస రవి, అధికారులు వెంకయ్య, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
చిన్నారుల పోలియో చుక్కలు వేయించాలి
నకిరేకల్ : ఐదేండ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల వేయించాలని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో ఎమ్మెల్యే వీరేశం చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ గాజుల సుకన్య, వైద్యాధికారి యోగస్వీ, హెచ్‌ఈఓలు రాపోలు రవి, వి. నర్సింహచారి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

