నల్లగొండ : నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రూ.40 కోట్ల వ్యయంతో నల్లగొండలో నిర్మించే నర్సింగ్ కాలేజీకి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డాక్టర్లు ట్రీట్ మెంట్ చేస్తారు.. పేషంట్ బాగోగులు చూసుకొని, వారికి బతుకుతారని ధైర్యం కల్పించేది నర్సులేనని పేర్కొన్నారు.ఇక్కడ నర్సింగ్ పూర్తి చేసిన వారికి విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉందన్నారు.
విద్యార్థులు సెల్ ఫోన్ లకు దూరంగా ఉండాలి. అప్పుడే జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారన్నారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కొత్తగా లా, ఫార్మసీ కాలేజీలు రాబోతున్నాయి. 4న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భూమి పూజ చేసుకోబోతున్నామని తెలిపారు.