దేశం గర్వించదగ్గ దిగ్గజం
దేశం గర్వించదగ్గ దిగ్గజాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరని, ఆయన అందరి వాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యను హక్కుగా పొందు పర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆలోచనలను అమలు చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు
- సమాజంలో చదువును మించిన ఆయుధం లేదు
- యువతలో సామాజిక బాధ్యత పెరుగాలి
- ఆ మహనీయుడి స్ఫూర్తిని కొనసాగిస్తున్నది సీఎం కేసీఆర్ మాత్రమే
- సూర్యాపేట అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి జగదీశ్‌రెడ్డి
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు
- పూలమాలలు వేసి అంబేద్కర్ సేవలను కొనియాడిన నేతలు, అధికారులు
దేశం గర్వించదగ్గ దిగ్గజాలలో బాబా సాహెబ్ అంబేద్కర్ ఒకరని, ఆయన అందరి వాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. విద్యను హక్కుగా పొందు పర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన ఆలోచనలను అమలు చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. అంబేద్కర్ స్ఫూర్తిని శాశ్వతంగా కొనసాగించడానికి సీఎం కేసీఆర్ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా ఆ మహనీయుడి 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని అన్నారు. ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం బాబా సాహెబ్ కట్టుబడి ఉన్న తీరు ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నివాళులర్పించారు.
సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 14 : డాక్టర్ బీఆర్.అంబేద్కర్ కొందరి వాడు మాత్రమే కాదని.. అందరి వాడని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశం గర్వించదగ్గ దిగ్గజాల్లో ఒకరని, ఆయన ఆలోచనల అమలే అసలైన నివాళి అని పేర్కొన్నారు. అంబేద్కర్ 132వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం క్రాస్ రోడ్‌లోని అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ జ్ఞానం, మేధస్సుకు సింబల్ అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని శాశ్వతంగా ఉంచడానికి సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడమే గాక ఆ మహనీయుడి 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయించారని తెలిపారు.
అంబేద్కర్ స్ఫూర్తిని గుర్తించింది దేశంలో సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. విద్యను హక్కుగా పొందుపర్చి దేశానికి వెలుగులు ఇచ్చిన మహనీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. ఆర్థిక, సామాజిక సమానత్వం కోసం ఆయన కట్టుబడి ఉన్న తీరు ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తున్నదన్నారు. అనంతరం ప్రబుత్వ రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను మంత్రి సత్కరించి ప్రశంసాపత్రాలు అందించారు. జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలతో పాటు కవి సమ్మేళనంలో విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో అడీషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మోహన్‌రావు, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ సంజీవనాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మున్సిపల్ మాజీ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కౌన్సిలర్లు జ్యోతి శ్రీవిద్య, మడిపల్లి విక్రమ్, భరత్ మహజన్, వెంపటి గురూ జీ, చిన శ్రీరాములు, డాక్టర్ రామ్మూర్తియాదవ్, నెమ్మాది వెంకటేశ్వర్లు, యాతాకుల రాజయ్య, గుద్దేటి ఎల్లయ్య, రాములు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

