సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున విడుదల చేసింది. ఇటీవల సూర్యాపేటలో కలెక్టరేట్, మెడికల్ కళాశాల, డీపీఓ తదితర భవనాల ప్రారంభోత్సవాల సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి జగదీశ్‌రెడ్డి కోరగా సీఎం కేసీఆర్ నిధుల మంజూరుకు హామీనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు మొత్తం 475 గ్రామపంచాయతీలకు గానూ 47.50 కోట్లు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పల్లెల అభివృద్ధికి ఈ నిధులు మరింత దోహదపడుతున్నాయి. నిధుల విడుదలపై సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.