కట్టంగూర్, మార్చి 21 : ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18 వేలు అందించాలని ఆశా వర్కర్ల సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి తవిటి వెంకటమ్మ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
ఆశా వర్కర్లకు పనిభారం తగ్గించి పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. ప్రమాద బీమా, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి ప్రసూతి సెలవుల సర్కులర్ జారీ చేయాలన్నారు. అనంతరం వైద్యాధికారి శ్వేతకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల సంఘం మండల అధ్యక్షురాలు చెవుగోని ధనలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యురాలు చెరుకు జానకి, ఆశా వర్కర్లు శోభ, పుష్పాంజలి, రేణుక, పద్మావతి, సునీత, జ్యోతి, మంగమ్మ, పార్వతమ్మ, సుజాత పాల్గొన్నారు.