మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేయాలి
మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు ఉగాదిలోపు పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను ఆదేశించారు. నకిరేకల్ పట్టణంలోని కాలంవారి కుంట చెరువు కట్టపై జరుగుతున్న మినీ ట్యాంకు బండ్ పనులను సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.
- మ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, డిసెంబర్ 20: మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులు ఉగాదిలోపు పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధికారులను ఆదేశించారు. నకిరేకల్ పట్టణంలోని కాలంవారి కుంట చెరువు కట్టపై జరుగుతున్న మినీ ట్యాంకు బండ్ పనులను సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మినీ ట్యాంక్ బండ్‌కు మొత్తం రూ.4.92 కోట్ల నిధులు కేటాయించామని, మొదటి విడుతగా మంజూరైన రూ.75 లక్షలతో పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఈ పనులు ఉగాది లోగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకు ముందు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌కు వీడియో కాల్ చేసి మినీట్యాంక్ బండ్ పనులను చూపించారు.
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
నకిరేకల్ పట్టణానికి చెందిన ఇద్దరికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పంపిణీ చేశారు. అనంతరం బాలల పరిరక్షణ కమిటీ కరదీపిక, పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్ బాలాజీ, వైస్ ఎంపీపీ గొర్ల వీరయ్య, గ్రంథాలయ కమిటీ చైర్మన్ కొండ వినయ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

